slc
-
క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్ బై
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ తిషారా పెరీరా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన నిర్ణయం ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)కి లేఖ ద్వారా పెరీరా తెలియజేశాడు. తన వీడ్కోలుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. శ్రీలంక తరఫున ఆరు టెస్టులు మాత్రమే ఆడిన పెరీరా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 37 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. టీ20ల్లో 1204 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 175 వికెట్లు సాధించిన పెరీరా.. అంతర్జాతీ టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. ‘ నేను శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా ఏడు క్రికెట్ వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత’ అని ఎస్ఎల్సీకి రాసిన లేఖల పేర్కొన్నాడు. తిషారా పెరీరా వీడ్కోలుపై ఎస్ఎల్సీ సీఈవో అష్లే డిసిల్వా మాట్లాడుతూ.. ‘ అతనొక గొప్ప ఆల్‌రౌండర్. శ్రీలంక క్రికెట్ సాధించిన పలు ఘనతల్లో పెరీరా భాగస్వామ్యం ఉంది. లంక క్రికెట్‌కు పెరీరా ఎంతో చేశాడు’ అని పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: ఐపీఎల్ రద్దు తప్పదా? ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్ వాయిదా! -
లీగ్ ఆరంభమే కాలేదు.. అప్పుడే ఫిక్సింగ్ కలకలం
కొలంబో: ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు(నవంబర్ 26వ తేదీ) ఆరంభం కానున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఆరంభం సీజన్‌కు అప్పుడే ఫిక్సింగ్ తాకిడి తగిలింది. మ్యాచ్‌లను తమకు అనుకూలంగా ఫిక్స్ చేయాలని జాతీయ జట్టుకుకు చెందిన మాజీ క్రికెటర్ ఎల్పీఎల్ ఆడే ఒక ప్లేయర్‌ను కలిసిన విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డులు దీనిపై సీరియస్ దృష్టి సారించాయి. భారీ ఫిక్సింగ్‌కు తెరలేపడానికి చూస్తున్నట్లు స్థానిక పత్రిక లంకా దీప తన కథనంలో పేర్కొంది. దాంతో ఐసీసీతో పాటు ఎస్ఎల్సీలు అలెర్ట్ అయ్యాయి. దీనిపై అప్పుడే ఐసీసీ విచారణకు రంగం సిద్ధం చేయగా, ఈ అంశంపై మాట్లాడటానికి మాత్రం నిరాకరించింది. ఎల్పీఎల్లో ఆడే విదేశీ ఆటగాడినే లక్ష్యంగా చేసుకుని ఫిక్సింగ్‌కు తెరలేపడానికి యత్నించినట్లు తెలుస్తోంది. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్ రికార్డు) కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఎట్టకేలకు ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కాగా, తొలుతనవంబర్ 14కు వాయిదా పడింది. మళ్లీ నవంబర్ 26వ తేదీకి వాయిదా వేస్తూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి కండీ టస్కర్స్‌తో ఇర్ఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇది ఎల్పీఎల్ ఆరంభపు సీజన్ కావడం గమనార్హం. డిసెంబర్ 16వ తేదీ వరకూ జరుగనుంది. అభిమానులు స్టేడియాల్లోకి అనుమతి లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. క్యాండీ టస్కర్స్- కొలంబో కింగ్స్ మధ్య రాత్రి గం.7.30ని.లకు ఆరంభపు మ్యాచ్ జరుగనుంది. (షమీ భార్య జహాన్‌కు వేధింపులు) -
శ్రీలంక క్రికెట్ బోర్డుకు పీసీబీ వార్నింగ్!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోగా, మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లమంటూ డుమ్మా కొట్టిన సందర్భంలో ‘జూనియర్’ జట్టునే పంపించి మరీ హుందాతనాన్ని చాటుకుంది ఎస్ఎల్సీ. కాగా, ఇప్పుడు శ్రీలంక క్రికెట్ జట్టుకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందంలో భాగంగా వచ్చే డిసెంబర్లో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యాటించాల్సి ఉంది. అయితే ఆ జట్టు వస్తుందా.. లేదా అనే సందిగ్థంతో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ముందుగానే బెదిరింపు చర్యలకు దిగింది. ఒకవేళ పాక్ పర్యటనకు రాకుండా తటస్థ వేదికైన యూఏఈలో ఆ సిరీస్‌ను నిర్వహించాలని కోరితే మాత్రం అందుకు అయ్యే ఖర్చును ఎస్ఎల్సీ కూడా సమంగా భరించాలంటూ వార్నింగ్ ఇచ్చింది. ‘పాకిస్తాన్లో పర్యటించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము భద్రతా పరంగా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. కొన్ని రోజుల క్రితం కరాచీ, లాహోర్ వేదికగా జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ విజయవంతమైంది. అలా కాకుండా యూఏఈలో నిర్వహించాలని పట్టుబడితే మాత్రం శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అందుకు ఖర్చు అయ్యే వాటాను భరించాలి’ అని పీసీబీలో అధికారి ఒకరు తెలిపారు. -
శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్ వేటు
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు హతురుసింఘా సేవలు అందించడం లేదని బోర్డు పేర్కొంది. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా రుమేష్ రత్ననాయకేయను నియమించింది. వరల్డ్‌కప్‌లో లంక పేలవ ప్రదర్శన కారణంగానే హతురసింఘాను తప్పించినట్లు తెలుస్తోంది. కాగా, హతురుసింఘాను తప్పించడానికి గల కారణాలను క్రికెట్ బోర్డు చైర్మన్ షిమ్మి సిల్వా వెల్లడించలేదు. హతురసింఘాకు భారీ మొత్తంలో నెలవారీ జీతం చెల్లిస్తున్న క్రమంలో అతని సేవలు అవసరం లేదని భావించే శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. హతురసింఘాకు నెలవారీ జీతం 40 వేల డాలర్లు కాగా, ఒక విదేశీ కోచ్ అందులో సగానికి వస్తాడని సదరు బోర్డు భావిస్తోంది. శ్రీలంక క్రికెట్ ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే ముగ్గురు పేర్లను పరిశీలించినట్లు ఆ దేశ క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో పేర్కొన్నారు. 2017లో హతురుసింఘాను ప్రధాన కోచ్‌గా నియమించారు. శ్రీలంక జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో హతురసింఘా కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే హతురుసింఘా పర్యవేక్షణలో కూడా లంక జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. వరల్డ్‌కప్‌లో అయితే లంక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ఆరోస్థానంలో నిలిచి లంక బోర్డు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేసింది. ఈ క్రమంలోనే లంక జట్టులో ప్రక్షాళన చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. -
మాథ్యూస్‌కు వెల్కమ్.. చండిమల్‌కు బైబై
కొలంబో: వచ్చే నెలలో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇప్పటికే లసిత్ మలింగాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించి దిముత్ కరుణరత్నేను సారథిగా నియమించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. తాజాగా పూర్తి జట్టును ప్రకటించింది. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌ను తిరిగి జట్టులోకి తీసుకోగా, గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న చండిమల్‌కు ఉద్వాసన పలికింది. అదే సమయంలో మలింగాను సైతం జట్టులో ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా మోచేతి గాయం కారణంగా జట్టుకు దూరమైన మాథ్యూస్.. తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్ సెలక్షన్ ట్రయల్‌లో భాగంగా దంబుల్లా తరఫున కాంపిటేటివ్ క్రికెట్ ఆడిన మాథ్యూస్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉన్నాయి. దాంతో మాథ్యూస్ ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. మరొకవైపు చండిమల్ పేలవమైన ఫామ్‌తో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శ్రీలంక వరల్డ్‌కప్ జట్టు ఇదే.. దిముత్ కరుణరత్నే(కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, లహిరు తిరుమన్నే, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వ, జీవన్ మెండిస్, మిలింద్ సిరివర్దనా, ఏంజెలో మాథ్యూస్, తిషారా పెరీరా, ఇసురు ఉదానా, లసిత్ మలింగా, సురంగా లక్మల్, జెఫ్రీ వాండర్సే, నువాన్ ప్రదీప్ స్టాండ్‌బై ఆటగాళ్లు.. ఒషాదా ఫెర్నాండో, కసున్ రజితా, హసరంగా, ఏంజెలో పెరీరా -
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్?
కొలంబో: ముంబై ఇండియన్స్‌కు ఊరటనిచ్చే వార్త. శ్రీలంక పేసర్ లసిత్ మలింగా మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్ సెలెక్షన్ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వేలం సమయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడమేంటని లంక బోర్డుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు ఫోన్ చేసిన బీసీసీఐ.. మలింగా విషయంలో స్పష్టత కోరినట్లు తెలిసింది. దాంతో చేసేదిలేక మలింగాకు ఎస్ఎల్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇక్కడ చదవండి: ఢిల్లీకి ఘనమైన ‘ఆరంభం’) ‘ఐపీఎల్లో మలింగా ఆడటానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇప్పటికే అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేశాం. అతను స్వేచ్ఛగా ఐపీఎల్ ఆడవచ్చు. వన్డేల్లో అతను మాకు ప్రధాన బౌలర్. అతనికి జట్టులో చోటు కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్ ఆడినా.. వరల్డ్‌కప్‌కు వెళ్లే మా జట్టులో మలింగా స్థానంపై ఢోకా ఉండదు’ అని ఎస్ఎల్సీ చీఫ్ సెలక్టర్ అశంతా డి మెల్ పేర్కొన్నట్లు సమాచారం. -
'అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు'
కొలంబో:శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా ఏంజెలో మాథ్యూస్‌ను తిరిగి ఎంపిక చేశారు. ఈ మేరకు మాథ్యూస్‌ను 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ సారథిగా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) మంగళవారం ప్రకటించింది. గతేడాది జూలై నెలలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పిన మాథ్యూస్‌ను మళ్లీ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.అయితే దీనిపై స్పందించిన మాథ్యూస్..' గతంలో సారథిగా తప్పుకున్నప్పుడే ఇక ఎప్పుడూ ఆ బాధ్యతల్ని మీద వేసుకోవాలని అనుకోలేదు. కాకపోతే ఎస్ఎల్సీ, ప్రధాన కోచ్, శ్రీలంక సెలక్టర్లు నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పట్టుబట్టారు. అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నా. వచ్చే వరల్డ్ కప్‌కు సమతుకంతో కూడిన జట్టును తయారు చేయాల్సి ఉంది. ఆ మెగా ఈవెంట్‌కు 18 నెలలు కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. నేను తిరిగి కెప్టెన్సీ చేపట్టడంలో మెంటర్ చందికా హతురసింఘా పాత్ర కీలకం. అతని ప్రేరణతోనే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించా'అని మాథ్యూస్ తెలిపాడు. -
లంక క్రికెటర్లు బిస్కెట్లు తినకూడదట..!
దంబుల్లా: ఇక శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్ లు ఆడే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సమయంలో బిస్కెట్లు తినకూడదట. లంక క్రికెటర్లు బిస్కెట్లు తినడంపై ఆ జట్టు యాజమాన్యం నిషేధం విధిస్తూ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ జట్టు మేనేజర్ అసాంక గురుసిన్హా తమ ఆటగాళ్లకు బిస్కెట్ల నిషేధాన్ని ధృవీకరించారు. 'మ్యాచ్ మధ్యలో విరామ సమయంలో ఆటగాళ్లు బిస్కెట్లు తినడం సహజంగా జరుగుతుంది. అయితే మా జట్టు ఫిజియో, శిక్షకుడు ఇచ్చిన ఆదేశాల కారణంగానే ఆటగాళ్లకు బిస్కెట్లు సరఫరా చేయడంపై నిషేధం విధించాం'అని గురుసిన్హా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీలంక క్రికెటర్ల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగలేదని, బిస్కెట్లు నిషేధంపై కనీసం చర్చించలేదన్నారు. ఇదిలా ఉంచితే, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన పదవికి రాజీనామా చేశానంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని గురుసిన్షా తెలిపారు. అయితే క్రికెటర్లు ఎందుకు బిస్కెట్లు తినకూడదు అనే దానిపై మాత్రం గురుసిన్హా వివరణ ఇవ్వలేదు. -
మా క్రికెట్ మ్యాచ్ లు చూడను..!
కొలంబో:2011 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ.. మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఆడే మ్యాచ్ లను చూడనంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణమే తనను తమ మ్యాచ్ లు చూడకుండా చేయడానికి ప్రధానకారణమని రణతుంగ పేర్కొన్నాడు. 'శ్రీలంక క్రికెట్ లో చీదరించుకునే వాతావరణం నెలకొని ఉంది. దాంతో మా జాతీయ జట్టు ఆడే మ్యాచ్ లను చూడాలని అనుకోవడం లేదు. మా జట్టు ఏ సిరీస్ ఆడుతున్నా చూసే ఆసక్తిమాత్రం నాకు లేదు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగున్న టెస్టు సిరీస్ ను చూడాలని నిర్ణయించుకున్నా. ఆయా జట్ల మధ్య జరిగే సిరీస్ ను చూస్తున్నా'అని రణతుంగా పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్ లో ప్రక్షాళన కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు రణతుంగా లేఖ రాస్తానని రణతుంగా వెల్లడించారు. -
జయవర్ధనే సరిపోడు..!
కొలంబో:చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత శ్రీలంక క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి గ్రాహం ఫోర్డ్ గుడ్ బై చెప్పడంతో ఆ జట్టులో ఒక్కసారిగా అనిశ్చిత ఏర్పడింది. శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ) అధ్యక్షుడు తిలంగా సుమతిపాలతో విబేధాల కారణంగా ఉన్నపళంగా కోచ్ పదవి నుంచి ఫోర్డ్ వైదొలిగాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎస్ఎల్సీ వేట ప్రారంభించింది. అయితే శ్రీలంక క్రికెట్ జట్టుకు కోచ్ గా ఆ దేశ మాజీ క్రికెటర్ జయవర్ధనే ఎంపిక అవుతాడనే వార్తలు తొలుత వినిపించాయి. ఇప్పటికే కోచ్ గా కొంత అనుభవం సంపాదించిన జయవర్ధనే ఎంపిక ఖాయంగా కనబడింది. కాగా, ఆ వార్తలను తిలంగా సుమతిపాల ఖండించారు. శ్రీలంక ప్రధాన కోచ్ పదవిని చేపట్టడానికి జయవర్దనే ప్రస్తుత అనుభవం సరిపోదని సుమతిపాల అభిప్రాయపడ్డారు. 'మహేలకు సీనియర్ కోచ్ గా కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉంది. ట్వంటీ 20 బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ గా జయవర్ధనే సెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రధాన కోచ్ రేసులో మాత్రం అతను లేడు'అని సుమతిపాల తేల్చిచెప్పారు. -
జయవర్ధనేపై శ్రీలంక బోర్డు గుర్రు
కొలంబో: మహేలా జయవర్ధనే.. శ్రీలంక మాజీ కెప్టెన్. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి తనదైన ముద్రను సంపాదించుకున్న ఆటగాడు. 2014 చివర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు మెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే జయవర్ధనేకు కష్టాలు తీసుకొచ్చేటట్లు కనబడుతోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జయవర్ధనే అప్పుడే వేరే జట్టుకు సలహాదారుగా పనిచేయడమేమిటని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) పెద్దలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒక జట్టుకు కోచ్ తదితర పాత్రలు పోషించాలంటే ఏ క్రికెటర్ అయినా వీడ్కోలు సమయం నుంచి కనీసం రెండేళ్లు కాల వ్యవధి తీసుకుంటాడని జయవర్ధనే తీరును ఎస్ఎల్సీ చైర్మన్ తిలంగా సుమిథిపాలా తప్పుబట్టారు. ఈ రకంగా చేయడం వల్ల ఒక జట్టులోని బలంతో పాటు బలహీనతల కూడా అవతలి జట్టుకు చేరే వేసే ప్రమాదం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది స్పోర్ట్స్ ఎథిక్స్ కు విఘాతం కల్గిస్తుందని పేర్కొన్నారు. తన దృష్టిలో కోచ్ గా పని చేసే సామర్థ్యం ఉండాలంటే జట్టు నుంచి బయటకొచ్చిన తరువాత రెండేళ్లు కాలపరిమిత తీసుకోవాలని తిలంగా స్పష్టం చేశాడు. మరోవైపు క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై జయవర్ధనే స్పందించాడు. తాను కేవలం ఇంగ్లండ్ క్రికెటర్లకు సాంకేతికంగా సాయపడటానికి మాత్రమే ఈ బాధ్యతను తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకంగా స్పిన్ విషయంలో వీక్ గా ఉండే ఇంగ్లండ్‌ను తీర్చిదిద్దడం తన కర్తవ్యంలో ఒక భాగమని స్పష్టం చేశాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ కు జయవర్ధనే మెంటర్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు బలహీనతల్ని చేరేవేస్తాడనే భయం క్రికెట్ బోర్డు పెద్దల్లో పట్టుకోవడమే ఈ తాజా వ్యాఖ్యలకు కారణం. -
వయో నిర్ధారణకు స్కూల్ సర్టిఫికెటే రుజువు!
న్యూఢిల్లీ: బాలనేరస్తుల వయస్సు నిర్ధారణకు సంబంధించి స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్(ఎస్ఎల్సీ)ను రుజువు కింద పరిగణనలోకి తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ధ్రువీకరణ పత్రం లభ్యమైనపక్షంలో.. వైద్యపరీక్షల పరంగా వయస్సు నిర్ధారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అనేక కేసుల్లో నిందితులు బాలనేరస్తులా? కాదా? అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ కె.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన గోస్వామికి సంబంధించిన ఎస్ఎల్సీని తానే స్వయంగా ఇచ్చినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపినందున ఆ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించడానికి వీల్లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. రంజిత్ గోస్వామిపై అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్టు 2008లో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టులో లొంగిపోయిన గోస్వామి నేరం జరిగిన సమయానికి తనకు 18 ఏళ్లు నిండలేదని, తాను బాలుడినని పేర్కొంటూ తన పుట్టినతేదీకి సంబంధించి పాఠశాల నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ కేసును జువెనైల్ బోర్డుకు బదిలీ చేశారు. అయితే వైద్య పరీక్షల్లో అతనికి 20 ఏళ్లుగా నిర్ధారణైంది. దీంతో వైద్య పరీక్షల్ని ప్రామాణికంగా తీసుకున్న జువెనైల్ బోర్డు అతన్ని మేజర్ కింద ప్రకటిస్తూ కేసు విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. అయితే జువెనైల్ బోర్డు నిర్ణయాన్ని సెషన్స్ జడ్జి తోసిపుచ్చారు. దీంతో వ్యవహారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరింది. జువెనైల్ బోర్డు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దీనిని గోస్వామి సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.