క్వార్టర్స్‌లో శ్రీకాంత్ | srikanth entered in quarter Finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీకాంత్

Published Fri, Mar 13 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

srikanth entered in quarter Finals

బాసెల్ (స్విట్జర్లాండ్): భారత యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్... స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ శ్రీకాంత్ 14-21, 21-15, 21-18తో ఎమిలి హోస్ట్ (డెన్మార్క్)పై నెగ్గాడు. తొలి గేమ్‌లో నిరాశపర్చిన శ్రీకాంత్... రెండో గేమ్‌లో బాగా ఆడాడు. కీలకమైన మూడో గేమ్‌లోనూ ఆధిపత్యం చేతులు మారడంతో స్కోరు 18-18తో సమమైంది.
 
 ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన భారత ప్లేయర్ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21-17, 21-16తో 13వ సీడ్ జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు నెట్ వద్ద విశేషంగా రాణించాడు. మరో భారత ఆటగాడు ఆనంద్ పవార్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. 21-19, 19-21, 15-21తో కుంజుమస సకాయ్ (జపాన్) చేతిలో ఓడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement