టీమిండియా లక్ష్యం 136 | srilanka set target of 136 runs against india in final t20 | Sakshi
Sakshi News home page

టీమిండియా లక్ష్యం 136

Published Sun, Dec 24 2017 8:38 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

srilanka set target of 136 runs against india in final t20 - Sakshi

ముంబై:  టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో శ్రీలంక 136 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆది నుంచి టీమిండియా బౌలర్ల విజృంభణ కొనసాగడంతో లంక జట్టు వంద పరుగుల మార్కును చేరడానికి అపసోపాలు పడింది. అయితే గుణరత్నే(36) ఫర్వాలేదనిపించడంతో శ్రీలంక మోస్తరు స్కోరును టీమిండియా ముందుంచింది.

టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ తీసుకున్న రోహిత్‌ సేన.. లంకను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో లంక ఇన్నింగ్స్‌ను డిక్వెల్లా, తరంగాలు ఆరంభించారు. కాగా,  కాగా, ఉనాద్కత్‌ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి డిక్విల్లా భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆపై మూడో ఓవర్‌ ఆఖరి బంతికి పెరీరాను వాషింగ్టన్‌ సుందర్‌ అవుట్‌ చేశాడు. ఇక్కడ ధోని స్టంపింగ్‌ చేయడంతో పెరీరా పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక నాల్గో ఓవర్‌లో తరంగా అవుటయ్యాడు. ఉనాద్కత్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి తరంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక సమరవిక్రమ(21) నాల్గో వికెట్‌గా అవుటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

కాగా, 12 ఓవర్‌లో గుణతిలకా(5)ను కుల్దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేయగా, ఆ తదుపరి ఓవర్‌లో కెప్టెన్‌ తిషారా పెరీరా(11)ను సిరాజ్‌ పెవిలియ్‌కు పంపాడు. అయితే ఏడో వికెట్‌కు షనక(29 నాటౌట్‌)-గుణరత్నేలు 26 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో పాటు చివరి ఓవర్‌లో దనంజయ(11 నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉనాద్కత్‌, హార్దిక్‌ పాండ్యాలు చెరో రెండు వికెట్లు సాధించగా, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు తలో వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement