శ్రీనివాసనే ఐసీసీ చైర్మన్ అభ్యర్థి | Srinivasan the chairman of the candidate for the ICC | Sakshi
Sakshi News home page

శ్రీనివాసనే ఐసీసీ చైర్మన్ అభ్యర్థి

Published Fri, Jun 20 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

Srinivasan the chairman of the candidate for the ICC

మరోసారి ఖరారు చేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఐసీసీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఎన్.శ్రీనివాసన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బీసీసీఐ మరోసారి ఖరారు చేస్తూ ఐసీసీకి సమాచారమిచ్చింది. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషన్ దాఖలు చేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బీహార్ (క్యాబ్)కు అధికారిక గుర్తింపు లేనందున సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే.

దీంతో ఈ నెల 23 నుంచి 28 వరకు జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశం అనంతరం 29న శ్రీనివాసన్.. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బీసీసీఐ ఇంతకుముందే నిర్ణయించినా.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎన్నికకు వారం రోజులు ముందు మరోసారి దాన్ని ఖరారు చేయాల్సివుంటుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement