మూడో రౌండ్లోకి వావ్రింకా | Stan Wawrinka stops Stepanek to move into third round | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్లోకి వావ్రింకా

Published Thu, Jan 21 2016 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

Stan Wawrinka stops Stepanek to move into third round

మెల్ బోర్న్: సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రపంచ నాల్గో ర్యాంకు ఆటగాడు స్టాన్ వావ్రింకా(స్విట్జర్లాండ్) మూడో రౌండ్ లోకి ప్రవేశించాడు.  గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో వావ్రింకా  6-2, 6-3, 6-4 తేడాతో రాడెక్ స్టెపెనెక్(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి మూడో రౌండ్ కు చేరుకున్నాడు.

 

ఇరువురి మధ్య హోరాహోరీగా రెండు గంటల పాటు సాగిన మ్యాచ్ లో వావ్రింకా ముందు స్టెపెనెక్ నిలబడలేకపోయాడు. ప్రత్యేకంగా నిర్ణయాత్మక మూడో సెట్ లో వీరి మధ్య అనేక మార్లు బ్రేక్ పాయింట్లు పరస్పరం దోబుచులాడినా చివరకు వావ్రింకానే పైచేయి సాధించి తదుపరి పోరుకు సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement