సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో గత ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్.. మరి కొద్ది రోజుల్లో ఆరంభమయ్యే ఐపీఎల్‌లో పాల్గొవాలనే యోచనలో ఉన్నాడు. వరల్డ్‌కప్‌కు సైతం సమయం దగ్గర పడుతుండటంతో ఐపీఎల్ ఆడి తన పూర్వపు ఫామ్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత జనవరిలో మోచేతి గాయం కారణంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)నుంచి అర్థాంతరంగా వైదొలిగిన స్మిత్.. సర్జరీ తర్వాత తొలిసారి నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లు నిషేధానికి గురయ్యారు. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిదినెలల నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. అయితే మార్చి 29వ తేదీతో స్మిత్, వార్నర్‌ల శిక్షా కాలం పూర్తి అవుతుంది. దాంతో వారిద్దరూ అప్పట్నుంచి అంతర్జితీయ సెలక్షన్స్‌కు అందుబాటులోకి వస్తారు. అయితే వరల్డ్‌కప్‌కు ముందుగా రానున్న క్యాష్‌రిచ్ లీగ్ ఐపీఎల్‌లో పాల్గొని దాన్ని సన్నాహకంగా ఉపయోగించుకోవాలనే గట్టి యత్నంలో స్మిత్ ఉన్నాడు. ఒకవేళ ఐపీఎల్‌కు స్మిత్ అందుబాటులోకి వస్తే రాజస్తాన్ రాయల్స్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment