నిషేధం: స్టీవ్‌ స్మిత్‌ అనూహ్య నిర్ణయం | Steve Smith says won’t challenge Cricket Australia sanctions, will serve ban | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 4 2018 12:26 PM | Last Updated on Wed, Apr 4 2018 3:57 PM

Steve Smith says won’t challenge Cricket Australia sanctions, will serve ban - Sakshi

స్టీవ్‌ స్మిత్‌ (ఫైల్‌ ఫొటో)

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విధించిన శిక్షను సవాలు చేయబోనని ఆయన ప్రకటించారు. నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు.  

కెప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌తోపాటు వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌పై సీఏ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘కెప్టెన్‌గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేయడం లేదు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది. వాటిని నేను ఆమోదిస్తున్నాను’ అని స్మిత్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో స్మిత్‌, వార్నర్‌పై ఏడాది చొప్పున నిషేధం విధించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. బెన్‌క్రాఫ్ట్‌ను తొమ్మిది నెలలు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిషేధించింది. ఈ నిషేధం నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ ఐపీఎల్‌ నుంచి కూడా ఏడాదిపాటు వైదొలగనున్నారు. స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఈ సారి కెప్టెన్సీ నిర్వహించాల్సి ఉంది. 2016లో వార్నర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు గత ఐపీఎల్‌ టోర్నీని గెలుపొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement