స్టీవ్ స్మిత్
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి అభిమానుల నమ్మకాన్ని పొందుతానన్నాడు. ఈ ఉదంతం అనంతరం స్మిత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తొలిసారి స్పందించాడు. తన సతీమణి డానీ విల్స్‌తో దిగిన ఫొటోకు క్యాఫ్షన్‌గా అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు.
‘‘ఆస్ట్రేలియాకు తిరిగి రావడం గొప్పగా ఉంది. నేను కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో దూరంగా ఉన్నా. దాని నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. చాలామంది ఈమెయిల్స్, లెటర్స్‌తో నాకు మద్దతు తెలిపారు. మళ్లీ మీ నమ్మకాన్ని తిరిగి పొందుతాను. ఆ సమయంలో మా తల్లితండ్రులు, నా భార్య ఇచ్చిన మద్దతు వెలకట్టలేనిది. వారికి ధన్యవాదాలతో్ సరిపెట్టలేను. ప్రపంచంలో ముఖ్యమైనది కుటుంబమే. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అని స్మిత్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో యువఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ కెమెరాలకు చిక్కడం.. ఇది జట్టు వ్యూహంలో భాగమని స్మిత్ ప్రకటించడం పెనుదుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఉదంతానికి సూత్రదారైన డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఏడాది పాటు.. బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు నిషేధం విధించింది. సీఏ చర్యతో స్మిత్, వార్నర్‌లను బీసీసీఐ ఈ సీజన్ ఐపీఎల్‌కు అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment