
స్టీవ్ స్మిత్ అజేయ శతకం
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 288/3
పాకిస్తాన్‌తో తొలి టెస్టు
బ్రిస్బేన్: ఫ్లడ్ లైట్ల వెలుతురులో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (110 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ శతకంతో రాణించడంతో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 90 ఓవర్లలో మూడు వికెట్లకు 288 పరుగులు చేసింది.
ఓపెనర్ రెన్‌షా (71; 9 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న హ్యాండ్స్‌కోంబ్ (64 బ్యాటింగ్; 8 ఫోర్లు)తో కలిసి స్మిత్ నాలుగో వికెట్‌కు అజేయంగా 110 పరుగులు జత చేశాడు.