సిడ్నీ: ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తనను వెంటాడుతున్న వివాదాన్ని మరచిపోయేందుకు దేశం విడిచి యూఏఈకి వెళ్లాడు. ఇంటా బయటా విమర్శల జడివాన కురుస్తుండటంతో ఉపశమనం పొందడానికి స్మిత్ తన కుటుంబంతో కలిసి యూఏఈకి పయనమయ్యాడు. ఈ క‍్రమంలోనే స్మిత్ క్రికెట్ కిట్‌ను తండ్రి పీటర్ గ్యారేజ్‌లో పడేశాడు. ఇప్పట్లో స్మిత్‌కు క్రికెట్‌తో పనిలేదు కాబట్టి అతని క్రికెట్ కిట్‌ను గ్యారేజ్‌లో పడేసినట్లు పీటర్ తెలిపాడు.
దక్షిణాఫ్రికా నుంచి గురువారం ఆసీస్ చేరుకున్న స్మిత్.. తండ్రితో కలిసి మీడియా సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతుండగా స్మిత్ బోరున విలపించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పీటర్.. తన బాధను దిగమింగుకుంటూ స్మిత్‌ను భుజం తట్టి ఓదార్చిన దృశ్యం అభిమానులను కంటతడి పెట్టించింది. అటు తర్వాత స్మిత్ క్రికెట్ కిట్‌ను గ్యారెజ్‌లో పడేశాడు.
Comments
Please login to add a commentAdd a comment