సచిన్, కోహ్లి
నాటింగ్‌హామ్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (103;197 బంతులు, 10 ఫోర్లు) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ శతకంతో కోహ్లి ఓవరాల్‌గా కెరీర్‌లో 58 సెంచరీలు(టెస్టుల్లో 23, వన్డేల్లో 35 కలుపుకుని) పూర్తి చేస్తుకున్నాడు. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 58వ సెంచరీ కూడా ఇంగ్లండ్ మీదే నమోదు కావడం విశేషం. అంతేకాదు.. సచిన్ సైతం కోహ్లిలానే 197 బంతుల్లోనే 103 పరుగులు చేయడం మరో విశేషం. ఇక కోహ్లికి టెస్టుల్లో 23వది కాగా.. సచిన్‌కు 27వది.. కోహ్లి ఇంగ్లండ్ గడ్డపై సాధిస్తే సచిన్ భారత గడ్డపై నమోదు చేశాడు.
ఆశ్చర్యం ఏంటంటే.. కోహ్లిలానే సచిన్ సైతం 58వ సెంచరీ కోసం అప్పట్లో తడబడ్డాడు. ఓవరాల్‌గా సచిన్ 100 సెంచరీలతో సాధ్యం కానీ రికార్డు నెలకొల్పగా.. కోహ్లి ఆ రికార్డును అధిగమించేలా దూసుకుపోతున్నాడు. 463వన్డేలు, 200 టెస్టుల్లో సచిన్ ఈ ఫీట్ సాధించగా.. కోహ్లి కేవలం 211 వన్డేలు, 68 టెస్టుల్లోనే 58 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇక 352 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చిన కోహ్లిసేన ఆతిథ్య జట్టుకు 521 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
Comments
Please login to add a commentAdd a comment