సుమీత్ జంటకు టైటిల్ | Sumeeth couple to the title | Sakshi
Sakshi News home page

సుమీత్ జంటకు టైటిల్

Published Mon, Sep 14 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

సుమీత్ జంటకు టైటిల్

సుమీత్ జంటకు టైటిల్

లువెన్ (బెల్జియం) : టాప్ సీడింగ్ హోదాకు తగ్గట్టు రాణించిన సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం బెల్జియం ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-మనూ జోడీ 22-10, 19-21, 22-20తో రెండో సీడ్ ఆడమ్ వాలినా-ప్రెజ్‌మైస్లావ్ (పొలెండ్) జంటపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఫైనల్‌కు చేరగా... రెండుసార్లు విజేతగా, మరో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement