కోహ్లీకి ఏమైంది.. గవాస్కర్ ఆందోళన!
ముంబై: భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ వైఫల్యాలపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ స్టంప్ అవతల కొత్త బంతిని ఎదుర్కొనే విషయంలో విరాట్ కోహ్లీ ఇబ్బందులెదుర్కొంటున్నారని గవాస్కర్ అన్నారు. వెస్టిండీస్ జట్టు చేతిలో భారత్ ఓటమి పాలుకావడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు.
ఇంగ్లాండ్ పర్యటన నుంచి కోహ్లీ వైఫల్యాల యాత్ర కొనసాగడం జట్టును వేధిస్తోంది. జట్టులో కొందరు సెంచరీలు చేస్తుంటే.. కనీసం 10, 20 పరుగులు చేయకపోవడం దారుణమని కోహ్లీపై గవాస్కర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. విజయం కోసం భారత ఆటగాళ్లు ఏ దశలోనూ ప్రయత్నించకుండా చేతులేత్తేశారని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.