నాల్గో వన్డేలో నో బాల్‌కు మిల్లర్ బౌల్డ్ అయిన సందర్భంలో చాహల్ నిరాశ
జోహన్నెస్‌బర్గ్: మూడు వన్డేల్లో ఏకపక్షంగా విజయాలు అందించిన భారత స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ వాండరర్స్ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. వీరిద్దరూ కలిసి 11. 3 ఓవర్లలో 119 పరుగులు సమర్పించుకున్నారు. చాహల్ వైడ్లు, నోబాల్‌తో అదనంగా పరుగులు ఇచ్చాడు. ప‍్రధానంగా చాహల్ వేసిన ఒక నోబాల్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. మిల్లర్ ఏడు పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా అవుటయ్యే ప‍్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చాహల్ వేసిన బంతి నో బాల్ కావడంతో మిల్లర్ బతికిపోయాడు. దీనిపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
' ఆధునిక క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో స్పిన్ బౌలర్ అయిన చాహల్ రెండు నోబాల్స్ వేశాడు. ఇందులో ఒక కీలక వికెట్ తీసిన సందర్భంలో నో బాల్ పడింది. ఆ మ్యాచ్‌లో చాహల్ మినహా ఎవరూ నోబాల్స్ వేయలేదు. ఒక వైడ్ కూడా వేశాడు. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న చాహల్.. ఇదే నా నీ ప్రొఫెషనలిజం. ఫాస్ట్ బౌలర్లు కొన్ని సందర్బాల్లో ఓవర్ స్టెపింగ్ వల్ల నోబాల్స్ వేస్తారు. మరి స్పిన్నర్ నో బాల్ వేయడమేమిటి. నీవు వేసిన ఒక నోబాల్ వల్ల మ్యాచ్ సఫారీల చేతుల్లోకి వెళ్లిపోయింది. మరొకవైపు వరుస మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా కాస్త రిలాక్స్ అయినట్లు కనిపించింది. అదే సమయంలో దాన్ని సఫారీలు బాగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా మిల్లర్, క్లాసెన్, ఫెహ్లుకోవాయోలు చక్కటి ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను గెలిపించారు' అని గావస‍్కర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment