చాహల్‌కు కోహ్లి అభినందన
సెంచూరియన్:భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో పలు రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో తొలుత 118 పరుగులకే కుప్పకూలిన సఫారీలు.. స్వదేశంలో తొలిసారి అత్యల్ప వన్డే స్కోరును నమోదు చేసిన చెత్త రికార్డును మూటకట్టుకోగా, భారత్ 177 బంతులు మిగిలి ఉండగా దక్షిణాఫ్రికాను వారి గడ్డపై ఓడించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అయితే ఈ విజయంలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌దే ప్రధాన పాత్ర. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లను సాధించి సఫారీ నడ్డివిరిచాడు. ఈ క్రమంలోనే కొత్త రికార్డును లిఖించాడు చాహల్. అది కూడా 19 ఏళ్ల నాటి రికార్డును చాహల్ తిరగరాశాడు.
ముందుగా దక్షిణాఫ్రికాపై భారత తరపున రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా రికార్డులెక్కాడు. 1999లో సఫారీలతో నైరోబిలో జరిగిన వన్డేలో మాజీ స్సిన్నర్ సునీల్ జోషి ఆరు పరుగులకే ఐదు వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి భారత్ తరపున దక్షిణాఫ్రికాపై చాహల్‌దే అత్యుత్తమ ప్రదర్శన. కాగా, సఫారీ గడ్డపై వన్డేల్లో ఆ జట్టుపై ఐదు వికెట్లు సాధించిన తొలి స్పిన్నర్‌గా కూడా చాహల్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. ఓవరాల్‌గా వన్డేల్లో చాహల్ ఇదే వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన.
Comments
Please login to add a commentAdd a comment