న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ఎంఎస్ ధోని తప్పుకుని, యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వ్యాఖ్యలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియా ఎన్డీటీవీతో గవాస్కర్ మాట్లాడుతూ.. 30 ఏళ్లు పైబడిన క్రికెటర్‌లో లోపాలు వెతకడం చాలా ఈజీ. ధోని విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది.
లక్ష్మణ్, అగార్కర్ లు భారత మాజీ క్రికెటర్లు. ధోని తప్పుకోవాలంటూ వారు సూచించారు. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. కెప్టెన్, కోచ్, సెలక్టర్లు జట్టు ఆటగాళ్లపై నిర్ణయం తీసుకుంటారు. ధోని ఏం చేస్తాడో, అతడి ప్లానింగ్ ఏంటో తెలుసుకునేందుకు కొంతకాలం వరకు ఎదురుచూద్దాం. 37 బంతుల్లో ధోని 49 పరుగులు చేశారని విమర్శిస్తున్నారు. రెండు టీ20ల్లో కలిసి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. భారత్ ఓటమిపాలైన రెండో టీ20లో సాధారణ గూగ్లీకి పాండ్యా ఔటైనా అతడిపై దృష్టి పెట్టడం లేదు. కేవలం ధోనినే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు, విమర్శలు చేయడం దురదృష్టకరమని’ గవాస్కర్ అన్నారు.
‘వన్డేల్లో ధోని అనుభవం, ఆట జట్టుకు ఉపయోగపడొచ్చు.. కానీ అతడు కెప్టెనా.. లేక కేవలం ఆటగాడా అన్నది మనం ఆలోచించాలి. వన్డే వరకు ధోనిని మనం తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ టీ20ల్లో మాత్రం ధోని సాధ్యమైనంత త్వరగా ఇతరులకు అవకాశమిస్తూ తప్పుకోవడం ఉత్తమమని’ అజిత్ అగాస్కర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment