చరిత్ర తిరగరాయాల్సిన సమయమిది : రైనా | Suresh Raina tweets over INDvSA in World cup | Sakshi
Sakshi News home page

చరిత్ర తిరగరాయాల్సిన సమయమిది : రైనా

Published Wed, Jun 5 2019 1:31 PM | Last Updated on Wed, Jun 5 2019 1:41 PM

Suresh Raina tweets over INDvSA in World cup - Sakshi

భారత అభిమానులకు అసలు సిసలు ప్రపంచ కప్ నేటి నుంచి మొదలవుతోంది. వరల్డ్‌ కప్‌లో భారత సమరం ప్రారంభమవ్వడానికి ముందు క్రికెటర్‌ సురేష్‌ రైనా ట్వీట్‌ చేశాడు. 'ఇది రాస్తుంటే లక్షలకొద్ది భావోద్వేగాలు, ఎన్నో మధుర జ్ఞాపకాలు నా మదిలో స్పృశించాయి. హిస్టరీని తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైంది. టీమ్‌ ఇండియా కప్‌ను భారత్‌ తీసుకురావాలి, గుడ్‌ లక్‌ అంటూ' ట్వీట్‌ చేశారు.

వాస్తవానికి ప్రపంచకప్‌ ప్రారంభమై వారం రోజులైనా భారత అభిమానుల్లో ఇంకా జోష్ రాలేదు. భారత్‌ ఇంకా ఒక్క మ్యాచ్‌ అడకపోవడమే అందుకు కారణం. అభిమానుల్లో ఈ నిరాసక్తతను పోగొడుతూ టీమిండియా సమరాని​కి సిద్దమైంది. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో తొలి పోరుతో ప్రపంచ కప్ వేటను భారత్ మొదలుపెట్టనుంది. ప్రపంచ కప్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగుతోన్న భారత్ మరోసారి కప్పు కొట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. 2011 అద్భుతాన్ని మరోసారి పునరావృతం కావాలని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement