న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తలలు పట్టుకుంటుంది. కరోనా వైరస్ ప్రభావంతో క్రీడా టోర్నీలు వాయిదాలు పడగా, ప్రతిష్టాత్మక ఈ మెగా టోర్నీ డైలమాలో పడింది. దీనిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి సీఏ, ఐసీసీలు. దీనికి కారణం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. సెప్టెంబర్ 30 వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేయగా, అప్పటిలోగా ఆ దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఆ ఆంక్షల్ని పొడిగించే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఒక బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అది ఎలా సాధ్యమనే ప్రశ్నను లేవనెత్తాడు. ‘ నిజాయితీగా చెప్పాలంటే అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ అనేది అసాధ్యం. ఆ సమయానికి ప్రజలు మ్యాచ్‌లు చూడటానికి వస్తారనే గ్యారంటీ లేదు. (నాకు అండగా నిలవలేదు: అశ్విన్)
ఎందుకంటే ఆ సమయానికి అంతర్జాతీయ ప్రయాణాలు ఎంతవరకూ సేఫ్ అనేది విషయాన్ని కూడా మనం చెప్పలేం. కొంతమంది జూన్ నెల వరకూ అంతా సర్దుకుంటుందని అంటున్నారు. మరికొంతమంది ఇంకా చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఒకసారి అంతర్జాతీయంగా ప్రయాణాలు ఆరంభం అయితే స్పష్టత వస్తుంది. ప్రస్తుత సమస్య కేవలం టోర్నీకి ఆతిథ్యమిచ్చే సీఏది మాత్రమే కాదు. అలా అని ఐసీసీ కూడా రిస్క్ తీసుకుంటుందని అనుకోవడం లేదు. టోర్నీ నిర్వహణ నిర్ణయం సీఏ, ఐసీసీలది అయితే కాదు.. ఇందులో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. అసలు ఆస్ట్రేలియా ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలనుకుంటుందా.. అలా అయితే అది ఎప్పుడు జరుగుతుంది. ఆ నిర్ణయం చెప్పడానికి సమయం పడితే అది ఇతర బోర్డులకు గడువు సరిపోతుందా?, ఇతర దేశాల ప్రభుత్వాలు తమ క్రికెట్ బృందాలను పంపడానికి అనుమతి ఇస్తాయా. ఇదంతా గందరగోళంగా ఉంది. దీనికి టీ20 వరల్డ్‌కప్ వాయిదా తప్పితే మరో దారి లేదు. నిర్ణీత షెడ్యూల్‌లో వరల్డ్‌కప్ అనేది అసాధ్యం అనే విషయంపై స్పష్టత వచ్చింది. ఐసీసీ తమ తదుపరి సమావేశాల్లో చర్చించినా షెడ్యూల్‌ను కొనసాగించడానికి డైరెక్ట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రస్తక్తే ఉండదు’ అని సదరు అధికారి తెలిపారు.(‘నా ప్రపంచకప్ పతకం కనిపించడంలేదు’)
Comments
Please login to add a commentAdd a comment