సెమీస్‌లో తమిళనాడు
► యూపీపై వికెట్ తేడాతో గెలుపు
► రాణించిన రాజగోపాల్ సతీష్
► విజయ్ హజారే ట్రోఫీ
బెంగళూరు: తమిళనాడు లక్ష్యం 50 ఓవర్లలో 169 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 118/6... ఇక గెలవాంటే 51 పరుగులు చేయాలి. ఈ దశలో రాజగోపాల్ సతీష్ (38 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) సంచలన బ్యాటింగ్ చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో కలిసి కష్టంగా మారిన లక్ష్యాన్ని సులువుగా ఛేదించాడు. దీంతో విజయ్ హజారే టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో తమిళనాడు వికెట్ తేడాతో ఉత్తర ప్రదేశ్‌పై నెగ్గింది. ఫలితంగా తమిళనాడు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉత్తర ప్రదేశ్ 48.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బాలాజీ 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తర్వాత తమిళనాడు 41.3 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇందర్‌జిత్ (48), మురళీ విజయ్ (33), శంకర్ (22) రాణించారు.
గుజరాత్ ముందుకు
ఆలూర్: లక్ష్య ఛేదనలో పార్థివ్ పటేల్ (57), అక్షర్ పటేల్ (36 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో మరో క్వార్టర్‌ఫైనల్లో గుజరాత్ 2 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి సెమీస్‌కు చేరింది. కేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన విదర్భ 48 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. ఫయాజ్ ఫజల్ (52), జితేష్ శర్మ (51), గణేశ్ సతీష్ (47) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 4, రుజుల్, అక్షర్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత గుజరాత్ 48.1 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. శనివారం జరిగే సెమీస్‌లో గుజరాత్.. తమిళనాడుతో తలపడుతుంది.