Mix-up
-
వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని తాగిన అథ్లెట్లు...ఆ తర్వాత..
School athletes drink sanitiser: నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఆయ దేశాలు తమ క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలను కల్పించి మరి దేశ విదేశాల్లో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది కూడా. కానీ కొన్నిచోట్ల అరకొర సౌకర్యాలతో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఉన్నారు. అంతేకాదు స్పోర్ట్స్ ట్రైయినింగ్ సెంటర్లలో క్రీడాకారులకు సంబంధించిన డైట్ విషయంలో నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో ఆడుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలానే ఒక పాఠశాలలోని అథ్లెట్లు స్పోర్ట్స్ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే...జపాన్‌లోని ఒక పాఠశాలలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జపాన్‌లోని యమనాషి ప్రిఫెక్చర్లో నిర్వాహకులు గత వారాంతంలో బాలికల 5 వేల మీటర్ల మారథాన్ రేసును నిర్వహించారు. ఐతే పొరపాటున నిర్వాహకులు వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేశారు. దీంతో ఒక అథ్లెట్ వాంతులు చేసుకుని రేసు నుంచి నిష్క్రమించగా, మరో ఇద్దరు మాత్రం ఉమ్మివేసి రేసుని తిరిగి కొనసాగించినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మొత్తం ముగ్గురు అథ్లెట్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. తాగునీటి వాటర్ బాటిల్ తోపాటు శానిటైజర్ కూడా అదే ప్లాస్టిక్ బాటిల్‌తో ఉందని హైస్కూల్ యమనాషి స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని యమనాషి గవర్నర్ కొటారో నాగసాకి తెలిపారు. అంతేకాదు ఆయన అథ్లెట్లకు వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక క్షమాపణలు చెప్పారు కూడా. (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
భారత్ కూత అదిరింది
దుబాయ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత కబడ్డీ జట్టు సెమీస్‌లో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. మాస్టర్స్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత పొందింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్ 36–20తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 10 రైడ్ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్‌లో గిరీశ్ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో జాంగ్ కున్ లీ ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన కొరియా ఆ తర్వాత భారత్ ముందు నిలువలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 17–10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా పట్టు కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 40–21తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. శనివారం జరుగనున్న తుది పోరులో భారత్, ఇరాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేటి ఫైనల్: రాత్రి గం. 7.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసీస్... తేల్చుకుందాం రా!
♦ ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన భారత్ ♦ కివీస్‌పై అద్భుత విజయం ♦ మిథాలీ రాజ్ సెంచరీ ♦ రాణించిన వేద, రాజేశ్వరి కివీస్‌ను తేల్చేశారు. చావోరేవోకు దిగిన మ్యాచ్‌లో తేలిగ్గా ఓడించారు. గెలిస్తేనే నిలిచే మ్యాచ్‌లో మిథాలీ సేన న్యూజిలాండ్‌ను ఆల్‌రౌండ్ దెబ్బతీసింది. మొదట విలువైన భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన భారత కెప్టెన్... తర్వాత బౌలింగ్‌లో రాజేశ్వరి గైక్వాడ్‌ను రంగంలోకి దించి ప్రత్యర్థి భరతం పట్టించింది. ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ వైవిధ్యమైన బంతులతో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేసింది. భారత్‌ను సగర్వంగా సెమీస్‌కు చేర్చింది. డెర్బీ: ఒత్తిడితో బరిలోకి దిగినా... ఓపెనర్లు విఫలమైనా... భారత్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరింది. శనివారం జరిగిన చివరి లీగ్ పోరులో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారీ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అసాధారణ ఫామ్‌లో ఉన్న మిథాలీ రాజ్ (123 బంతుల్లో 109; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కింది. వేద కృష్ణమూర్తి (45 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధ సెంచరీ సాధించింది. తర్వాత న్యూజిలాండ్ 25.3 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (5/15) అద్భుతమైన స్పెల్‌కు కివీస్ కుదేలైంది. మిథాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. వేద వేగం... మిథాలీ వీరోచితం టాస్ నెగ్గిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పూనమ్ రౌత్ (4), స్మృతి మంధన (13) విఫలమయ్యారు. అప్పుడు జట్టు స్కోరు 21/2. ఈ దశలో కెప్టెన్ మిథాలీ రాజ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ జతయ్యింది. ఇద్దరు మొదట క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లకు 31 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత కూడా వికెట్లను కాపాడుకున్నా పరుగుల వేగాన్ని మాత్రం పెంచలేకపోయారు. కుదురుగా ఆడుతున్న మిథాలీ 28వ ఓవర్లో కొట్టిన ఫోర్‌తో ఆమె అర్ధసెంచరీ (71 బంతుల్లో), జట్టు 100 పరుగులు ఒకేసారి పూర్తయ్యాయి. మరోవైపు హర్మన్‌ప్రీత్ అర్ధశతకాన్ని 83 బంతుల్లో చేసింది. ఇద్దరు మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించాక జట్టు స్కోరు 153 పరుగుల వద్ద హర్మన్‌ప్రీత్ (90 బంతుల్లో 60; 7 ఫోర్లు) కాస్పెరెక్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. తర్వాత వచ్చిన దీప్తి శర్మ (0) డకౌట్ కాగా... మిథాలీతో జతకట్టిన వేద ధాటిగా ఆడింది. ఆమె మెరుపులతో కివీస్ బౌలింగ్ కకావికలమైంది. వీరిద్దరూ 12 ఓవర్లలోనే 100 పరుగులు జతచేశారు. వేద 47 ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టి... 34 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసింది. మిథాలీ 116 బంతుల్లో సెంచరీని అధిగమించింది. వన్డేల్లో ఆమెకిది ఆరో సెంచరీ. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. కాస్పెరెక్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మిథాలీ, వేద, శిఖాపాండే (0) ఔటయ్యారు. శనివారమే జరిగిన చివరి రౌండ్ ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 59 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాపై, ఇంగ్లండ్ 92 పరుగుల ఆధిక్యంతో విండీస్‌పై, శ్రీలంక 15 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై గెలిచాయి. ‘టాప్’ ఇంగ్లండ్... మొత్తం ఎనిమిది జట్ల మధ్య లీగ్ దశ పోటీలు ముగిశాక 12 పాయింట్లతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో ఇంగ్లండ్‌కు టాప్ ర్యాంక్ దక్కగా... ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 10 పాయింట్లతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఈనెల 18న జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్; 20న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడతాయి. 23న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధన (బి) హన్నా రొవి 13; పూనమ్ రౌత్ (సి) కెటీ మార్టిన్ (బి) తహుహు 4; మిథాలీ రాజ్ (సి) శాటర్‌వైట్ (బి) కాస్పెరెక్ 109; హర్మన్‌ప్రీత్ (సి అండ్ బి) కాస్పెరెక్ 60; దీప్తిశర్మ (సి) ప్రిస్ట్ (బి హన్నా రొవి 0; వేద కృష్ణమూర్తి రనౌట్ 70; సుష్మ వర్మ నాటౌట్ 0; శిఖా పాండే (సి) శాటర్‌వైట్ (బి) కాస్పెరెక్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–10; 2–21, 3–153, 4–154, 5–262, 6–265, 7–265. బౌలింగ్: లే కాస్పెరెక్ 10–3–45–3, తహుహు 10–1–49–1, హన్నా రొవి 10–3–30–2, సుజీ బేట్స్ 8–0–59–0, అమిలియా కెర్ 10–0–64–0, శాటర్‌వైట్ 2–0–15–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సుజీ బేట్స్ (సి) వేద (బి) శిఖా పాండే 1; ప్రిస్ట్ (సి అండ్ బి) జులన్ గోస్వామి 5; శాటర్‌వైట్ (స్టంప్డ్) సుష్మ (బి) రాజేశ్వరి 26; కెటీ మార్టిన్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి శర్మ 12; సోఫీ డివైన్ (సి) దీప్తి శర్మ (బి) రాజేశ్వరి 7; పెర్కిన్స్ (బి) దీప్తి శర్మ 1; గ్రీన్ (సి) జులన్ (బి) పూనమ్ యాదవ్ 5; హన్నా రొవి (బి) రాజేశ్వరి 4; అమిలియా కెర్ నాటౌట్ 12; తహుహు (సి) జులన్ (బి) రాజేశ్వరి 5; కాస్పెరెక్ (బి) రాజేశ్వరి 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (25.3 ఓవర్లలో ఆలౌట్) 79. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–27, 4–51, 5–52, 6–57, 7–62, 8–62, 9–67, 10–79. బౌలింగ్: జులన్ గోస్వామి 5–1–14–1, శిఖాపాండే 5–1–12–1, దీప్తి శర్మ 6–0–26–2, రాజేశ్వరి 7.3–1–15–5, పూనమ్ యాదవ్ 2–0–12–1. కివీస్ (బి) రాజేశ్వరి 79 పిచ్ పరిస్థితుల దృష్ట్యా 266 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ అనూహ్యంగా భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ఉచ్చులో చిక్కుకుంది. శిఖా పాండే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌తో మొదలైన కివీస్ పతనం క్రమం తప్పకుండా 26 ఓవర్లదాకా సాగింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (1), ప్రిస్ట్ (5) మాత్రమే పేసర్లు శిఖా, జులన్‌లకు తలవంచగా... ఇక మిగతా పనంతా స్పిన్నర్లదే! రాజేశ్వరి రంగప్రవేశంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. శాటర్‌వైట్ చేసిన 26 పరుగులే కివీస్ ఇన్నింగ్స్ టాప్ స్కోరు కాగా, కెటీ మార్టిన్ (12), అమిలియా (12) రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీప్తి 2 వికెట్లు తీయగా, శిఖా, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
సెమీస్‌లో సిక్కి రెడ్డి జంట
అల్మెరె (నెదర్లాండ్స): డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-10, 10-21, 21-17తో రోనన్ లాబెర్-ఆడ్రీ ఫొంటెరుున్ (ఫ్రాన్స) జంటపై గెలిచింది. మరోవైపు సుమీత్ రెడ్డి-జక్కంపూడి మేఘన జోడీకి పరాజయం ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సుమీత్-మేఘన జంట 7-21, 10-21తో మార్విన్ ఎమిల్ సిడెల్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
సెమీస్‌లో తమిళనాడు
► యూపీపై వికెట్ తేడాతో గెలుపు ► రాణించిన రాజగోపాల్ సతీష్ ► విజయ్ హజారే ట్రోఫీ బెంగళూరు: తమిళనాడు లక్ష్యం 50 ఓవర్లలో 169 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 118/6... ఇక గెలవాంటే 51 పరుగులు చేయాలి. ఈ దశలో రాజగోపాల్ సతీష్ (38 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) సంచలన బ్యాటింగ్ చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో కలిసి కష్టంగా మారిన లక్ష్యాన్ని సులువుగా ఛేదించాడు. దీంతో విజయ్ హజారే టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో తమిళనాడు వికెట్ తేడాతో ఉత్తర ప్రదేశ్‌పై నెగ్గింది. ఫలితంగా తమిళనాడు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉత్తర ప్రదేశ్ 48.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బాలాజీ 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తర్వాత తమిళనాడు 41.3 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇందర్జిత్ (48), మురళీ విజయ్ (33), శంకర్ (22) రాణించారు. గుజరాత్ ముందుకు ఆలూర్: లక్ష్య ఛేదనలో పార్థివ్ పటేల్ (57), అక్షర్ పటేల్ (36 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో మరో క్వార్టర్ఫైనల్లో గుజరాత్ 2 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి సెమీస్‌కు చేరింది. కేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన విదర్భ 48 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. ఫయాజ్ ఫజల్ (52), జితేష్ శర్మ (51), గణేశ్ సతీష్ (47) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 4, రుజుల్, అక్షర్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత గుజరాత్ 48.1 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. శనివారం జరిగే సెమీస్‌లో గుజరాత్.. తమిళనాడుతో తలపడుతుంది. -
సెమీస్‌లో యూకీ బాంబ్రీ
పుణే: ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ యూకీ 6-4, 7-6 (4)తో టి చెన్ (తైపీ)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి ఓడింది. -
టైటాన్స్ తొడగొడుతుందా!
-
టైటాన్స్ తొడగొడుతుందా!
బెంగళూరు బుల్స్‌తో సెమీస్ నేడు ప్రొ కబడ్డీ లీగ్ ముంబై: తొలి సీజన్లో ఒకే ఒక్క పాయింట్‌తో ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకున్న తెలుగు టైటాన్స్ రెండో సీజన్లో మాత్రం దుమ్మురేపింది. అద్భుతమైన రైడింగ్.. అంతకుమించిన క్యాచింగ్‌తో సీజన్-2లో జైత్రయాత్ర కొనసాగించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు (శుక్రవారం) జరిగే సెమీస్ పోరులో టైటాన్స్.. బెంగళూరు బుల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 విజయాలు, మూడు డ్రాలతో 50 పాయింట్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. రాహుల్ చౌదరి (79 పాయింట్లు) ఈసారి కూడా ఒంటిచేత్తో ఫలితాలను శాసిస్తున్నాడు. అయితే రాహుల్ విఫలమైన ప్రతిసారి సుకేశ్ హెగ్డే, ప్రశాంత్ రాయ్‌లు జట్టుకు అండగా నిలవడం టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం. ఓవరాల్‌గా ఈ ముగ్గురి రైడింగ్‌తో ప్రస్తుతం టైటాన్స్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక దీపక్ నివాస్ హుడా క్యాచింగ్‌తో పాటు రైడింగ్‌లోనూ ఉపయోగపడుతుండటం టైటాన్స్ జట్టుకు అదనపు బలంగా మారింది. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్న మరో ఆటగాడు మిరాజ్ షేక్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానున్నాడు. మరోవైపు బెంగళూరు బుల్స్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ సీజన్లో టైటాన్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ఓటమిపాలైంది. అజయ్ ఠాకూర్, కెప్టెన్ మంజీత్ చిల్లర్, రాజేశ్ మొండల్, సోమ్‌వీర్ శేఖర్ కీలక ఆటగాళ్లు. ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్‌కు అడ్డుకట్ట వేయాలని బెంగళూరు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండో సెమీస్‌లో పటిష్టమైన యు ముంబాతో... పట్నా పైరేట్స్ జట్టు తలపడుతుంది.