
సెమీస్‌లో సిక్కి రెడ్డి జంట
అల్మెరె (నెదర్లాండ్‌స): డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-10, 10-21, 21-17తో రోనన్ లాబెర్-ఆడ్రీ ఫొంటెరుున్ (ఫ్రాన్‌స) జంటపై గెలిచింది.
మరోవైపు సుమీత్ రెడ్డి-జక్కంపూడి మేఘన జోడీకి పరాజయం ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సుమీత్-మేఘన జంట 7-21, 10-21తో మార్విన్ ఎమిల్ సిడెల్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోరుుంది.