
దుబాయ్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత కబడ్డీ జట్టు సెమీస్‌లో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. మాస్టర్స్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత పొందింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్ 36–20తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 10 రైడ్ పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెన్స్‌లో గిరీశ్ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో జాంగ్ కున్ లీ ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో గట్టి పోటీనిచ్చిన కొరియా ఆ తర్వాత భారత్ ముందు నిలువలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 17–10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా పట్టు కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 40–21తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది. శనివారం జరుగనున్న తుది పోరులో భారత్, ఇరాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
నేటి ఫైనల్: రాత్రి గం. 7.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment