ఛాంపియన్స్ ట్రోఫికి టీం ఇండియా
న్యూఢిల్లీ: ఎట్టకేలకు సందిగ్దత తొలగింది. ఛాంపియన్‌ట్రోఫీలో టీం ఇండియా ఆడనుంది. ఇటీవల ఐసీసీతో వచ్చిన విభేదాల కారణంగా టీం ఇండియా ఛాంపియన్స్‌ట్రోఫిలో ఆడుతుందా లేదా అనే అనుమానం క్రికెట్ అభిమానులను తొలిచివేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 1నుంచి ఇంగ్లాండ్‌లో జరగనుంది.
తాజాగా బీసీసీఐ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందని ప్రకటించింది. దీంతో పాటు ఐసీసీకి ఎటువంటి నోటీసులు ఇవ్వకూడదని నిర్ణయించింది. నూతన ఆర్థిక విధానంతో బీసీసీఐ-ఐసీసీ మధ్య తలెత్తిన వివాదానికి మధ్యస్తం ద్వారా పరిస్కరించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా జాయింట్ సెక్రటరీగా ఉన్న అమితాబ్ చౌదరికి ఈబాధ్యతలు అప్పగించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది.
‘ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కోసం గత నెల 25లోపే భారత జట్టును ప్రకటించాల్సి ఉన్నా నేటి దాకా జట్టును వెల్లడించలేదు. వెంటనే సెలక్షన్ కమిటీని సమావేశపరిచి టీమిండియా జట్టును ప్రకటించాలని బీసీసీఐ సంయుక్త కార్యదర్శిని నూతన పాలక మండలి (సీఏవో) హెచ్చరించిన సంగతి తెలిసిందే.