సత్తాచాటిన తెలంగాణ క్రీడాకారులు
తెలంగాణ స్విమ్మింగ్ బృందం చరిత్ర సృష్టించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో నిర్వహించిన గ్లెన్ మార్క్ 43వ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నాలుగు జాతీయ పతకాలను తెలంగాణ జట్టు సాధించింది. తొలిసారిగా బాలికల విభాగంలో ఈ ఏడాది పతకం సాధించారు. గత ఏడాది బాలుర విభాగంలో పతకం సాధించిన విషయం తెలిసిందే.
ట్రిణా తనుజ్ 800 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణపతకం, 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పతకం సాధించారు. 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల విభాగంలో గోలి జాహ్నవి కాంస్య పతకాలు వచ్చాయి. జియాన్ స్పోర్ట్జ్ క్లబ్ కోచ్ జాన్ సిద్దిఖీ వద్ద శిక్షణ పొందిన తెలంగాణ బృందంలో జి. చంద్రిక, ఎం. ఇష్వి, దిషా, శ్రీజ, నటాషా, జి.జాహ్నవి, ట్రిణా తనుజ్, సూర్యాన్షు, సాయిరామ్, శివరామ, రుతిక్, సాయినిహార్ తదితరులున్నారు.
ఆటగాళ్ల తాజా ర్యాంకుల వివరాలు:
► రుతిక్ 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో 8వ ర్యాంకు, ఫ్రీ స్టైల్ విభాగంలో 4 వ ర్యాంకు
► సూర్యాన్షు 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో 6వ ర్యాంకు, 100 మీటర్ల బటర్ ఫ్లై స్ట్రోక్ విభాగంలో 8వ ర్యాంకు
► శ్రీజ 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 7వ ర్యాంకు, 200 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 5వ ర్యాంకు
► నటాషా 50 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 5వ ర్యాంకు, 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 6వ ర్యాంకు, 200 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 6వ ర్యాంకులు సాధించారు.