విజేతలు రమేశ్, తేజస్వి | tejaswi, ramesh won 5k run titles | Sakshi
Sakshi News home page

విజేతలు రమేశ్, తేజస్వి

Published Mon, May 29 2017 10:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

విజేతలు రమేశ్, తేజస్వి

విజేతలు రమేశ్, తేజస్వి

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజ్‌లో ఆదివారం జరిగిన సమ్మర్‌ రోడ్‌ రన్‌ పోటీల్లో రమేశ్, తేజస్వి విజేతలుగా నిలిచారు. అథ్లెటిక్స్‌ కోచింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పురుషుల 5కె రన్‌లో సికింద్రాబాద్‌ పీజీ కాలేజ్‌కి చెందిన రమేశ్‌ 15 నిమిషాల 55.7 సెకన్లలో పరుగు పూర్తి చేసి టైటిల్‌ సాధించాడు. ఈ పోటీల్లో సెయింట్‌ జోసెఫ్‌ విద్యాసంస్థకు చెందిన పవన్‌ తేజ (16ని.00.9 సెకన్లు), జెడ్పీహెచ్‌ఎస్‌ మేకగూడకి చెందిన శ్రీనివాస్‌ (16ని.00.9 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల 5కె రన్‌లో పి.తేజస్వి (సెయింట్‌ పాయిస్‌–25ని.02.1 సెకన్లు) విజేతగా నిలిచింది. హిమబిందు (రెడ్డి కాలేజ్‌–26ని.03.2 సెకన్లు), నిత్య (జేజీఎస్‌–26ని.20.1 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు లయన్స్‌ క్లబ్‌ రీజనల్‌ చైర్మన్‌ లయన్‌ శ్రీనివాస్‌ రెడ్డి బహుమతులు అందజేశారు.

ఇతర విభాగాల ఫలితాలు: బాలురు: అండర్‌–16 5కె: 1. అజయ్‌కుమార్‌ ( (డీఎల్‌ఎస్‌–17ని.56.3 సెకన్లు), 2. రాయుడు (జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ, 18.01.1), 3. సుమిత్‌ (హైదరాబాద్,18.04.3). అండర్‌–13 (2.5 కి.మీ): 1. రమేశ్‌ సింగ్‌ (ఆర్మీ స్కూల్, 9.18.1), 2. చిన్నయ్య (జెడ్పీహెచ్‌ఎస్,  మేకగూడ 9.29.3), 3. రంజిత్‌ కుమార్‌ (జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ 9.32.2). అండర్‌–10 (1.5 కి.మీ): 1. నందు ( జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ 8.35.6), 2. భార్గవ్‌ (జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ 8.36.7), 3. రాజేశ్‌ (జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ 8.45.2). మాస్టర్‌ పురుషులు (2.5 కి.మీ): 1. సంజయ్‌ కుమార్‌ (లయన్స్‌ క్లబ్‌ ,12.14.1), 2. స్వాములు (12.45.9), 3. సుందర్‌ రాజన్‌ (ఎస్‌బీఐ, 14.12.6).

బాలికలు: అండర్‌–16 (5 కి.మీ): 1. కీర్తి (రైల్వే జూనియర్‌ కాలేజ్, 20.59.1), 2. సౌజన్య (ఎస్‌జీబీహెచ్‌ఎస్, 21.59.1), 3. జువేరియా (హైదరాబాద్, 22.24.6); అండర్‌–13 (2.5 కి.మీ): 1. తస్లీమా (తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్, 10.22.1), 2. యువిక (కెన్నడీ వీబీ, 10.29.1), 3. పి. శ్రేయ (మమత హెచ్‌ఎస్, 11.10.5); అండర్‌–10 (1.5 కి.మీ): 1. తేజస్వి (జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ 8.58.1), 2. శిరీష (జెడ్పీహెచ్‌ఎస్, మేకగూడ 8.59.6), 3. శ్రేయ (హైదరాబాద్, 9.44.7). మాస్టర్‌ మహిళలు: (2.5 కి.మీ) 1. రూప (14.01.1), 2. సునీత  (హైదరాబాద్, 15.00.3), 3. సుబ్బలక్ష్మి (16.10.1).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement