తెలంగాణ జట్లకు మూడో స్థానం | telagana teams placed third at sepak takraw | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్లకు మూడో స్థానం

Published Mon, Nov 28 2016 11:24 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

telagana teams placed third at sepak takraw

సాక్షి, హైదరాబాద్: ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ అండర్-19 సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌‌సలో ఆదివారం బాలుర విభాగంలో జరిగిన కాంస్యపతక పోరులో తెలంగాణ 21-13, 21-10తో గుజరాత్‌పై గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో తెలంగాణ 12-21, 9-21తో ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. మరో సెమీస్‌లో మణిపూర్ 25-5, 21-6తో గుజరాత్‌ను ఓడించింది.

 

బాలికల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలంగాణ 21-12, 21-11తో మహారాష్ట్రపై విజయం సాధించింది. సెమీస్‌లో తెలంగాణ 14-21, 15-21తో ఒడిశా చేతిలో, మహారాష్ట్ర 6-21, 13-21తో మణిపూర్ చేతిలో కంగుతిన్నాయి. బాలుర ఫైనల్లో ఢిల్లీతో మణిపూర్, బాలికల ఫైనల్లో మణిపూర్‌తో ఒడిశా తలపడతాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement