జాతీయ సీనియర్ వాలీబాల్
చెన్నై: జాతీయ సీనియర్ పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. శనివారం మొదలైన ఈ పోటీల లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 25-14, 25-16, 25-12తో బిహార్‌ను ఓడించింది. ప్రారంభోత్సవం సందర్భంగా... దివంగత వాలీబాల్ మేటి క్రీడాకారులు అబ్దుల్ బాసిత్ (తెలంగాణ), జిమ్మీ జార్జి (కేరళ) కుటుంబాలకు రూ. లక్ష చొప్పున భారత వాలీబాల్ సంఘం (వీఎఫ్‌ఐ) ఆర్థిక సహాయం అందజేసింది.
కాంస్యం నెగ్గిన తోషాలి
చెన్నై: చెన్నై ఓపెన్ ‘ఫిడే’ రేటింగ్ కేటగిరి-బి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వి.తోషాలి కాంస్య పతకాన్ని సాధించింది. శనివారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత వైజాగ్‌కు చెందిన తోషాలి 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం తొమ్మిది రౌండ్లలో తోషాలి ఏడు గేమ్‌లలో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. 8.5 పాయింట్లతో అనిల్ కు మార్ (కేరళ) విజేతగా నిలిచాడు.
తెలంగాణ విజయం
Published Sun, Jan 4 2015 1:11 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM
Advertisement
Advertisement