
విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఐపీఎల్ ద్వారా ఇండియాతో ఆత్మీయత ఏర్పడి పోయింది. ఇక్కడి పరిస్థితులన్నా.. అలవాట్లన్నా తనకు చాలా ఇష్టమని గతంలో గేల్ చాలా సార్లు చెప్పుకున్నాడు. ఇక గేల్ మైదానంలోనే కాదు.. బయట కూడా ఫుల్ జోష్‌ను ప్రదర్శిస్తుంటాడు. ఇండియన్ పాటలను వినటం.. వాటికి చిందులేయటం ఇతగాడికి అలవాటే. తాజాగా గేల్ డాన్స్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
‘తేరీ ఆక్యా కా యో కాజల్’ అంటూ సింగర్ వీర్ దహియా పాడిన హర్యానా పాట(హరియాణ్వి జానపద గేయం).. ఉత్తరాదిలో బాగా పాపులర్ అయ్యింది. పాటలో నటించిన స్వప్న చౌదరి పేరు మార్మోగిపోయింది. ఏ వేడుకలో అయినా దాదాపుగా ఈ పాట సందడి తప్పనిసరి అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు తమ వర్షన్‌లుగా ఆయా పాటలకు చిందులు కూడా వేశారు. అలాంటి సాంగ్‌కు గేల్ లయబద్ధంగా స్టెప్పులేస్తూ ఊగిపోయాడు. అయితే ఆ వీడియో కొత్తదా? పాతదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ, ఫేస్‌బుక్.. యూట్యూబ్‌లో ఇప్పుడు కొందరు తెగ వైరల్ చేస్తుండటంతో ట్రెండ్‌లోకి వచ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment