న్యూఢిల్లీ: ఏడాదిన్నర పైగా విరామం తర్వాత హైదరాబాద్ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 12 నుంచి 16 మధ్య జరుగనున్న రెండో టెస్టుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదిక కానుంది. తొలి టెస్టు అక్టోబర్ 4 నుంచి 8 వరకు రాజ్‌కోట్‌లో జరుగనుంది. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.
తొలి మ్యాచ్ అక్టోబరు 21న గువాహటిలో, రెండో వన్డే 24న ఇండోర్‌లో, మూడో వన్డే 27న పుణెలో, నాలుగో వన్డే 29న ముంబైలో, ఐదో వన్డే నవంబరు 1న తిరువనంతపురంలో నిర్వహిస్తారు. నవంబరు 4న కోల్‌కతాలో, 6న లక్నోలో, 11న చెన్నైలో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు యూఏఈలో ఈ నెల 15 నుంచి 28 వరకు సాగే ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొంటుంది. తర్వాత వారం వ్యవధిలోనే విండీస్‌తో తొలి టెస్టు మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment