భారత బృందానికి రోహిత్ శుభాకాంక్షలు | The Indian team Best wishes to Rohit | Sakshi
Sakshi News home page

భారత బృందానికి రోహిత్ శుభాకాంక్షలు

Published Fri, May 6 2016 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

భారత బృందానికి రోహిత్ శుభాకాంక్షలు

భారత బృందానికి రోహిత్ శుభాకాంక్షలు

 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ తన సంతకంతో కూడిన ఓ బ్యాట్‌ను స్టార్ షూటర్ గగన్ నారంగ్‌కు బహూకరించాడు. ‘గో ఫర్ గోల్డ్’ అనే నినాదాన్ని బ్యాట్‌పై రాశాడు.

గురువారం జరిగిన పుణే అంతర్జాతీయ స్పోర్ట్స్ ఎక్స్‌పో (పీఐఎస్‌ఈ) కార్యక్రమంలో నారంగ్‌తో కలిసి రోహిత్ పాల్గొన్నాడు. దేశానికి ఇలాంటి ఎగ్జిబిషన్లు చాలా అవసరమని రోహిత్ అభిప్రాయపడగా, ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించడమే తన లక్ష్యమని నారంగ్ స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement