మహిళలకూ కబడ్డీ లీగ్ | the women's Kabaddi League | Sakshi
Sakshi News home page

మహిళలకూ కబడ్డీ లీగ్

Published Tue, Jun 28 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

the women's Kabaddi League

నేటి నుంచి ప్రారంభం

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తరహాలో నేటి (మంగళవారం) నుంచి మహిళల కబడ్డీ చాలెంజ్ ప్రారంభం కానుంది. ఇందులో మూడు జట్లు పాల్గొంటున్నాయి. ఫైర్ బర్డ్స్‌కు మమతా పూజారి, ఐస్ డివాస్‌కు అభిలాష మాత్రే, స్టార్మ్ క్వీన్స్‌కు తేజస్విని బాయ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ప్రొ కబడ్డీ లీగ్ జరిగే వేదికల్లోనే ఈ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి.

పోటీ 30 నిమిషాలపాటు సాగుతుంది. ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 31న ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్‌తో పాటే ఈ పోటీల తుది పోరు కూడా జరుగుతుంది. మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement