
టెస్టు క్రికెట్‌లో ‘టాస్’ తొలగించాలంటూ ఇటీవల వినిపించిన చర్చకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముగింపు పలికింది. ఇకపై కూడా టాస్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. ‘టాస్ వేయకుండా పర్యాటక జట్టుకు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. అయితే టెస్టు క్రికెట్‌లో టాస్ అంతర్గత భాగంగా క్రికెట్ కమిటీ భావించింది’ అని ఐసీసీ ప్రకటించింది. ఇకపై సిరీస్ విజయానికి కాకుండా మ్యాచ్‌కు పాయింట్లు కేటాయించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment