'కొత్త క్రికెట్ కమిటీని ఏర్పాటు చేస్తాం' | Tripura Cricket Association to Implement Lodha Committee Reforms From January 3 | Sakshi
Sakshi News home page

'కొత్త క్రికెట్ కమిటీని ఏర్పాటు చేస్తాం'

Published Tue, Jan 3 2017 12:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

జస్టిస్ లోధా(ఫైల్ ఫోటో)

జస్టిస్ లోధా(ఫైల్ ఫోటో)

త్రిపుర:జస్టిస్ లోధా ప్యానెల్ సిఫారుసుల్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బోర్డు పెద్దలు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై వేటు పడటంతో రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఇప్పటికే లోధా ప్యానల్ సూచనల్ని అమలు చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆంధ్ర క్రికెట్ సంఘం స్పష్టం చేయగా, తాజాగా త్రిపుర క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) కూడా ముందుకొచ్చింది. లోధా సిఫారుసుల్ని వెంటనే అమలు చేస్తామంటూ త్రిపుర క్రికెట్ సంఘం కార్యదర్శి సౌరవ్ దాస్ గుప్తా తెలిపారు.

 

'మేము లోధా కమిటీ సిఫారుసుల్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిలో భాగంగా మంగళవారం వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహించనున్నాం. టీసీఏ ప్రస్తుత కమిటీ రాజీనామా చేస్తుంది. ఈ రోజే కొత్త క్రికెట్ కమిటీ ఏర్పాటవుతుంది. ఆ మరుక్షణమే కొత్త కమిటీ పరిపాలన బాధ్యతలను తీసుకుంటుంది' అని దాస్ గుప్తా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement