సాయ్ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్
న్యూఢిల్లీ : నలుగురు మహిళా అథ్లెట్ల ఆత్మహత్యాయత్నం వెనుక గల పరిస్థితులను కొట్టిపారేయలేమని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) స్పష్టం చేసింది. ఈ విషాదంపై ఇప్పుడున్న స్థితిలో ఎలాంటి వ్యాఖ్యానం చేయదలుచుకోలేదని సాయ్ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. విష ఫలాన్ని భుజించి నలుగురు టీనేజ్ అథ్లెట్లు అళెప్పీ సాయ్ సెంటర్‌లో ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఇందులో ఒకరు మరణి ంచారు. ‘వీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో జరిగే ఉంటుంది. ఈ విషయంలో నిజానిజాలు చట్టం వెలికితీస్తుంది. క్రీడా మంత్రి ఆదేశాల మేరకు నేనక్కడకు వెళ్లాను. పూర్తి నివేదికను ఆయనకు అందిస్తాను’ అని శ్రీనివాస్ తెలిపారు.
విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి
Published Sun, May 10 2015 1:38 AM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM
Advertisement