
కేకేఆర్ ఆటగాడు శుబ్‌మన్ గిల్
కోల్‌కతా : ఐపీఎల్ చరిత్రలో సొంతగడ్డపై ఛేదనలో తమ గెలుపును కట్టడిచేయడం అంత సులువు కాదని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మరోసారి నిరూపించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై కేకేఆర్ చక్కటి ఆటతీరుతో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. నరైన్ ఆల్‌రౌండర్ ప్రతిభకు, గిల్ సమయోచిత బ్యాటింగ్ తోడవడంతో కేకేఆర్ విజయం సాధించింది గాయం కారణంగా నితీశ్ రాణా మ్యాచ్‌కు దూరమవడంతో శుబ్‌మన్ గిల్‌కు నాల్గో స్థానంలో ఆడే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న గిల్ ఐపీఎల్‌లో తన తొలి అర్ధసెంచరీ(57 నాటౌట్) నమోదు చేశాడు. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ ఆటగాడిపై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.
‘ఒక కొత్త స్టార్ జన్మించాడు! శుబ్‌మన్ గిల్ చాలా స్పెషల్.. ఎంతో చక్కగా, శక్తివంతంగా బంతిని బాదాడు’ అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. ‘శుబ్‌మన్ గిల్!!! మరో అండర్ 19 ఆటగాడు ఐపీఎల్‌ను ప్రకాశవంతం చేస్తున్నాడంటూ’ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాగన్ ప్రశంసలు కురిపించారు. ‘కోహ్లి భవిష్యత్ సచిన్ అయితే.. శుబ్‌మన్ గిల్ భవిష్యత్ కోహ్లి అయ్యే సత్తా ఉన్న ఆటగాడు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘నాల్గో స్థానంలో ఆడే అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న శుబ్‌మన్ గిల్.. ఐపీఎల్‌లో తన తొలి అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఈ రోజు అతడిదే..’ అంటూ సీఎస్‌కే ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసించాడు.
A star is born! Shubnam Gill is special.. hits the ball with a mix of elegance and power #KKRvsCSK
— Rajdeep Sardesai (@sardesairajdeep) May 3, 2018
If Virat is the next Sachin
— Kaushik (@Sarcasmm007) May 3, 2018
Then Shubman Gill has the potential to be next Virat.#KKRvCSK #IPL2018 #KKRHaiTaiyaar
Shubman Gill !!!! Another India U19 player lighting up the #IPL ..........
— Michael Vaughan (@MichaelVaughan) May 3, 2018
Comments
Please login to add a commentAdd a comment