
దుబాయ్: ఆసియాకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పనిపట్టింది టీమిండియా. బౌలింగ్‌తో పాక్ ఆటగాళ్లను బెంబేలెత్తించి.. బ్యాటింగ్‌తో రెచ్చిపోయి పాక్‌పై భారీ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ 162 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన భారత్.. మరో 21 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన చూసి ఫిదా అయ్యారు. ట్విటర్ వేదికగా భారత ఆటగాళ్లపై ట్వీటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
‘మంచి విజయం సాధించారు. కంగ్రాట్స్ ఇండియా. జట్టు సమగ్ర కృషి చాలా బాగుంది. ఈ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించారు’ అని సెహ్వాగ్ అభినందించగా, ‘24 గంటల్లోనే రెండు వన్డే మ్యాచ్‌ల్లో భారత్ విజయం. ఇది సాధ్యమవుతుందని ఎవరైనా ఊహించారా? చాలా బాగా ఆడారు’ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ‘కంగ్రాట్స్ ఇండియా. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అంతా కలిసి చక్కటి ప్రదర్శన చేశారు’ అని సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ‘అంత వేడిలో వెనువెంటనే రెండు మ్యాచ్‌లు.. ప్రతిధ్వనించే విజయాలు.. బౌలర్లు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రోహిత్ సమర్థంగా జట్టును నడిపించాడు. కంగ్రాట్స్ టీమిండియా’ అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందించగా, ‘ అద్భుతంగా ఆడారు.. కంగ్రాట్స్ టీమిండియా’ అని రైనా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment