స్పాట్ ఫిక్సింగ్: పాక్ క్రికెటర్ల అరెస్ట్! | two Pakistan cricketers arrested in PSL spot fixing case | Sakshi
Sakshi News home page

స్పాట్ ఫిక్సింగ్: పాక్ క్రికెటర్ల అరెస్ట్!

Published Wed, Feb 15 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

స్పాట్ ఫిక్సింగ్: పాక్ క్రికెటర్ల అరెస్ట్!

స్పాట్ ఫిక్సింగ్: పాక్ క్రికెటర్ల అరెస్ట్!

లండన్: స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని పాక్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ నాసిర్ జంషెడ్, మరో క్రికెటర్ యూసఫ్ ను అదుపులోకి తీసుకోగా.. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బుధవారం వెల్లడించింది. ఇతర విషయాలను వెల్లడించేందుకు పీసీబీ నిరాకరించింది.

ఫిబ్రవరి 13న ఇద్దరు క్రికెటర్లను అరెస్టు చేసినట్లు బ్రిటన్ జాతీయ క్రైమ్ అథారిటీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ వరకూ గడువు ఇస్తూ వారికి బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పారు. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ ఇదివరకే.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పీసీబీ అవినీతి నిరోధక విభాగం తమకు ఫిక్సింగ్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించిందని, ఫిక్సర్లపై చర్యలు తీసుంటామని పీఎస్ఎల్ చైర్మన్ నజీమ్ సెతీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement