అమెరికాలో పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని అమెరికా ఫెడరల్ కోర్టు ఉగ్రవాదిగా గుర్తించింది. అతడు దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించినట్లు పేర్కొంది. అబిద్ నసీర్(28) అనే పాక్ దేశీయుడు తమ దేశంలోని నిత్యం రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, సబ్ వేలను పేల్చి వేసేందుకు కుట్రలు పన్నినట్లు కోర్టు పేర్కొంది. అతడు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థలో చేరి ఇప్పటికే బ్రిటన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడని వివరించింది. 2009 ఏప్రిల్లో మాంచెస్టర్కు వచ్చిన నజీర్ కొన్నాళ్లు రెక్కీ నిర్వహించి పేలుళ్లు జరిపేందుకు వ్యూహం పన్నినట్లు ఆధారాలున్నాయని వెల్లడించింది. పాకిస్థాన్లోని సీనియర్ ఉగ్రవాదుల సూచనలతో మేరకు అతడు పనిచేసినట్లు కోర్టు గుర్తించింది.