వన్డేల్లో 19వ సెంచరీ చేసిన కోహ్లి
ఫతుల్లా: ఛేజింగ్ హీరో విరాట్ కోహ్లి మరోసారి శతకం బాదాడు. లక్ష్య ఛేదనలో చెలరేగి ఆడే అలవాటును కొనసాగించాడు. ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లి సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 19వ సెంచరీ కావడం విశేషం. 131 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ కూడా సెంచరీ సాధించాడు. రహీమ్ 117 పరుగులు చేశాడు. కోహ్లి విజృంభణతో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. కోహ్లికి అంజిక్య రహానే చక్కటి సహకారం అందించాడు. రహానే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.