కోహ్లి విజయోత్సాహం
నాటింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో కోహ్లి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. 38 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లి.. భారత్‌కు 22 విజయాలందించాడు. అతని కెప్టెన్సీలో భారత్ కేవలం 7 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా 9 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు.
ఈ జాబితాలో సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని 27 విజయాలతో తొలి స్థానంలో ఉండగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 49 టెస్టుల్లో 21 విజయాలతో, ఆజారుద్దీన్ 47 మ్యాచుల్లో 14 విజయాలతో కోహ్లి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలందించగా.. కోహ్లి కేవలం 38 మ్యాచ్‌ల్లో 22 విజయాలందించడం విశేషం. కోహ్లి ఇదే ఊపు కొనసాగిస్తే మరి కొద్ది రోజుల్లోనే ధోనిని అధిగమిస్తాడనడంలో అతిశయోక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment