కోల్‌కతా : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో టెస్ట్ కెరీర్‌లో 18వ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌గానూ సెంచరీలతో తనదైన మార్కు చేరుకున్నాడు కోహ్లీ. భారత కెప్టెన్‌గా అత్యధిక శతకాలు (11) సాధించిన గవాస్కర్ రికార్డును ఈ శతకంతో ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ సమం చేశాడు. దీంతో టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ శతకాలు చేసిన భారత ఆటగాళ్లలో 11 శతకాలతో సునీల్ గవాస్కర్, కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో గవాస్కర్, కోహ్లీ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో మాజీ కెప్టెన్లు అజారుద్దీన్(9), సచిన్ టెండూల్కర్(7), ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(5), రాహుల్ ద్రావిడ్(4) ఉన్నారు. త్వరలోనే కోహ్లీ, దిగ్గజ ఆటగాడు గవాస్కర్ టెస్ట్ కెప్టెన్ శతకాల రికార్డును అధిగమిస్తాడు. టెస్ట్ కెరీర్‌లో 18వ శతకం సాధించిన కోహ్లీ.. ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాలు సాధించిన 8వ క్రికెటర్‌గా నిలిచాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన క్రికెటర్ గానూ కోహ్లీ మరో అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు సచిన్(100), రికీ పాంటింగ్(71), సంగక్కర(63), కల్లిస్(62), జయవర్దనే(54), ఆమ్లా(54), బ్రియన్ లారా(53)లు యాభైకి పైగా అంతర్జాతీయ సెంచరీలు బాదారు.
Comments
Please login to add a commentAdd a comment