కోహ్లీని బాధ పెట్టిన వైరల్ వీడియో..
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో విద్య ఎప్పుడూ పిల్లలను బాధించేదే. పాఠశాలలు అయిపోయిన తర్వాత కూడ తల్లిదండ్రులు పిల్లలను గంటలకొద్ది సేపు ట్యూషన్ల పేరుతో హింసిస్తుంటారు. పోటీతత్వం పేరుతో వారిని మానసికంగా వేధిస్తున్నారు. దీంతో పసిహృదయాలు ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని కోల్పోతున్నారు.
దీనిని ఉదహరిస్తూ సోషల్ మీడియాలో ఒక చిన్నారిని అంకెలు నేర్చుకోమని ఏడిపిస్తున్న ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో చిన్నారి అంకెలు చదివేటప్పుడు గట్టిగా చదువుతూ చెప్పమంటూ ఉపాధ్యాయురాలి బెదిరింపు గొంతు వినిస్తుంది. ఇందులో చిన్నారిని తిడుతూ అంకెలు నేర్చుకోమని బెదిరిస్తుంది. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కొంచెం ప్రేమగా చెప్పమని వేడుకుంటుంది.
ఈవీడియోపై భారత క్రికెటర్లు స్పందించారు. ఈవీడియోను ప్రతిఒక్కరూ ఖండించారు. దీనిపై యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిన్నపిల్లల బాధ విస్మరించతగ్గ విషయం కాదని, పిల్లలను బెదిరిస్తే ఏదీ నేర్చకోలేరన్నారు. చిన్న పిల్లలకు ప్రేమతో ఆప్యాయతతో నేర్పించాలని సూచించారు. ఈ విషయం చాలా బాధాకరం అని షోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.