వన్డేల్లో విరాట్ కోహ్లి 18వ సెంచరీ
నేపియర్: విరాట్ కోహ్లి వీర విహారం ఇప్పట్లో ఆగేట్టు కనబడడం లేదు. సెంచరీలు మీద సెంచరీలు కొడుతూ దూసుకుపోతున్నాడీ భారత బ్యాట్స్మన్. శతకం సాధించడం ఇంత సులవా అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీ కొట్టడం తనకు అలవాటు అన్నట్టుగా బాదేస్తున్నాడు.
తాజాగా న్యూజిలాండ్తో నేపియర్లో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ కొట్టాడు. 93 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్తో శతకం పూర్తిచేశాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసి అవుటయ్యాడు. వన్డేల్లో కోహ్లికిది 18వ సెంచరీ కావడం విశేషం. 126 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించడం మరో విశేషం. కోహ్లి ఇదే దూకుడు కొనసాగిస్తే బ్యాటింగ్లో అతడు రికార్డులు సృష్టించడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంటున్నారు.