వరుసగా నాలుగో విజయం | Virat, Sundar extend India Under-19s' winning run | Sakshi
Sakshi News home page

వరుసగా నాలుగో విజయం

Published Fri, Dec 18 2015 12:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Virat, Sundar extend India Under-19s' winning run

► లంకపై భారత్ గెలుపు
► రాణించిన విరాట్, సుందర్
► అండర్-19 ముక్కోణపు సిరీస్

 కొలంబో:
వాషింగ్టన్ సుందర్ (77 బంతుల్లో 61; 5 ఫోర్లు), విరాట్ సింగ్ (89 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లు చెలరేగడంతో... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో లంక అండర్-19 టీమ్‌పై నెగ్గింది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేసింది.
 
  బండారా (116 బంతుల్లో 74; 4 ఫోర్లు), మెండిస్ (93 బంతుల్లో 65; 2 ఫోర్లు) రాణించగా మిగతా వారు నిరాశపర్చారు. 166 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక మరో 55 పరుగులు జోడించి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. కలీల్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. తర్వాత భారత్ 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సుందర్, విరాట్‌లకు తోడు మహిపాల్ (32), అనుమోల్‌ప్రీత్ సింగ్ (25) ఫర్వాలేదనిపించారు. సుందర్, అనుమోల్ మూడో వికెట్‌కు 55; విరాట్, మహిపాల్ ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. లాహిర్ కుమార రెండు వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement