
న్యూఢిల్లీ: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ల మధ్య మళ్లీ బ్యాట్, బాల్ పోరు జరగనుంది. కానీ ఈసారి క్రికెట్ గ్రౌండ్‌లో కాదు... ఐస్ క్రికెట్‌లో! శీతల దేశమైన స్విట్జర్లాండ్ ఈ ఆసక్తికర పోరుకు వేదికైంది. సెయింట్ మోరిట్జ్‌లో ఈ ఐస్ క్రికెట్ జరగనుంది. అయితే అక్కడ ఐస్ క్రికెట్ కొత్త కాదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే 1988లో ఈ ఆట మొదలైంది. కానీ అంతర్జాతీయ స్టార్స్ మాత్రం ఇందులో ఎన్నడూ తలపడలేదు.
ఇప్పుడు ఈ చిరకాల ప్రత్యర్థులతో పాటు కైఫ్ (భారత్), జయవర్ధనే, మలింగ (శ్రీలంక), హస్సీ (ఆసీస్), స్మిత్, కలిస్ (దక్షిణాఫ్రికా), వెటోరి, నాథన్ మెకల్లమ్, ఎలియట్ (కివీస్), పనేసర్, ఓవైస్ షా (ఇంగ్లండ్) తదితరులు మ్యాటింగ్ పిచ్‌పై హంగామా చేయనున్నారు. వచ్చే ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగే ఐస్ టి20 మ్యాచ్‌ల్లో ఆడేందుకు వీరూ లాంటి స్టార్స్‌కు రూ. 32.50 లక్షలు (50 వేల డాలర్లు), మిగతా వారికి 19.50 లక్షలు (30 వేల డాలర్లు) పార్టిసిపేషన్ ఫీజుగా చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment