'ఆ ఫాస్ట్‌ బౌలర్‌.. హాకీకి క్లీన్‌ బౌల్డ్‌' | Virender Sehwag's Hilarious Take on Zaheer Khan Engagement | Sakshi
Sakshi News home page

'ఆ ఫాస్ట్‌ బౌలర్‌.. హాకీకి క్లీన్‌ బౌల్డ్‌'

Published Tue, Apr 25 2017 2:47 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

'ఆ ఫాస్ట్‌ బౌలర్‌.. హాకీకి క్లీన్‌ బౌల్డ్‌'

'ఆ ఫాస్ట్‌ బౌలర్‌.. హాకీకి క్లీన్‌ బౌల్డ్‌'

ముంబై: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించే టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. నిశ్చితార్థం చేసుకున్న మాజీ టీమ్‌మేట్‌ జహీర్‌ ఖాన్‌కు అభినందనలు తెలిపాడు. పేసర్‌ అయిన జహీర్‌ హాకీకి క్లీన్‌ బౌల్డయ్యాడంటూ చమత్కరించాడు.

'జహీర్‌కు అభినందనలు. అతను హాకీకి క్లీన్‌ బౌల్డయ్యాడు. ఇద్దరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ వీరూ ట్వీట్‌ చేశాడు. జహీర్‌ తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి సాగరిక ఘాట్గెతో నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆమె చక్‌ దే ఇండియా సినిమాలో హాకీ క్రీడాకారిణిగా నటించింది. దీంతో వీరూ పైవిధంగా కామెంట్‌ చేశాడు. మాజీలు సౌరభ్ గంగూలీ, రవిశాస్త్రి తదితరులు జహీర్‌కు అభినందనలు తెలిపారు. జహీర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఓ వైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉంటూనే ప్రియురాలితో నిఖాను పక్కా చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement