
'అతను బౌలర్ల కెప్టెన్'
బెంగళూరు:సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్పై అసిస్టెంట్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్లో అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ జట్టును ముందుండి నడిపించాడని కొనియాడాడు. అతనొక స్ఫూర్తిదాయకమైన క్రికెటర్ అని వీవీఎస్ ప్రశంసించాడు.
కొన్నిసార్లు చాలా సానుకూల థృక్పదంతో మరికొన్ని సందర్భాల్లో దూకుడుగా ఉంటూ జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించడన్నాడు. సన్ రైజర్స్ ప్రతీ విజయంలోనూ వార్నర్ పాత్ర వెలకట్టలేనిదన్నాడు. తన దృష్టిలో వార్నర్ బౌలర్ల కెప్టెన్ అని వీవీఎస్ అభిప్రాయపడ్డాడు. జట్టు క్లిష్ట సమయాల్లో బౌలర్లకు విపరీతమైన స్వేచ్ఛనిచ్చి వారి వెనకే నిలిచేవాడన్నాడు. కెప్టెన్సీలో వార్నర్కు పెద్దగా అనుభవం లేకపోయినా, జట్టును సమష్టిగా ముందుకు నడిపి విజయవంతమయ్యాడని వీవీఎస్ తెలిపాడు.