ఇప్పటికీ అదే బెస్ట్ ఇన్నింగ్స్..
లండన్: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్‌కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈడెన్ గార్డెన్స్ (2001)లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న తీరు ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. ఈ ఇన్నింగ్స్ కు మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత 16 ఏళ్లలో లక్ష్మణ్ ఆడిన ఈడెన్ ఇన్నింగ్స్‌కు అత్యుత్తమ గుర్తింపు దక్కడం విశేషం.
లండన్ కు చెందిన 'ఆలౌట్ క్రికెట్' మ్యాగజైన్ నిర్వహించిన తాజా ఓటింగ్లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ కు ప్రథమ స్థానం కట్టబెట్టారు. పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్తో సహా 37 మంది కూడిన ప్యానెల్లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ కు అగ్రస్థానం దక్కింది. మరోవైపు 2004లో పాకిస్తాన్పై వీరేంద్ర సెహ్వాగ్ నమోదు చేసిన ట్రిపుట్ సెంచరీకి తొమ్మిది స్థానం దక్కగా, 2003లో ఆస్ట్రేలియాపై రాహుల్ ద్రవిడ్ నమోదు చేసిన 233 పరుగులకు నాల్గో స్థానం లభించింది. జనవరి 1, 2000 సంవత్సరం నుంచి ఆటగాళ్ల టాప్-20 టెస్టు ఇన్నింగ్స్ లకు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 2001లో లక్ష్మణ్తో కలిసి ఐదో వికెట్కు 371 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసే క్రమంలో ద్రవిడ్(180) పరుగులకు 14వ స్థానం దక్కింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 59 పరుగులు చేసిన లక్ష్మణ్.. రెండో ఇన్నింగ్స్లో 281 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా చుక్కలు చూపించిన లక్ష్మణ్ ఆనాటి భారత్ గెలుపులో కీలక పాత్ర వహించాడు. లక్ష్మణ్-ద్రవిడ్ల అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ 171 పరుగులతో విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో ఈఎస్‌పీఎన్ డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌కే తొలిస్థానం దక్కింది. గత ఐదు దశాబ్దాలలో 50 అత్యుత్తమ ప్రదర్శనలకు ఈ ఓటింగ్ నిర్వహించారు.