
'క్రికెటర్లూ..ముందు మీ శైలి మార్చుకోండి'
కరాచీ: తరుచు వివాదాల నడుమ పయనిస్తూ పేలవమైన ఆటను ప్రదర్శిస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లకు ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ కొన్ని సూచనలు చేశాడు. తొలుత పరాజయాల నుంచి బయటపడాలంటే క్రికెటర్లు తమ శైలిని తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఒకవేళ అలా కాకుంటే జట్టుకు తీవ్ర నష్టం వాటిల్లితుందని తెలిపాడు.
'నేను ఒక విషయంగా స్పష్టంగా చెబుతున్నా. పాక్ క్రికెటర్లు వారి శైలిని సరైన మార్గంలో పెట్టడానికి యత్నించాలి. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.జట్టులో స్థానం కోల్పోయి ప్రమాదం కూడా ఉంది' అని వకార్ హెచ్చరించాడు. దీనిపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఒక నివేదిక అందజేశానని.. వాటిని బోర్డు పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 18 కోట్ల ప్రజల ఆశలను బ్రతికించాలంటే క్రికెటర్లు జాగ్రత్తగా ఆడటం మంచిదన్నాడు. దేశానికి సెలెక్ట్ అయ్యే ముందు క్రికెటర్ల నడవడిక చాలా ముఖ్యమైన అంశమని వకార్ పేర్కొన్నాడు.