లండన్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీలు యువరాజ్ ఆటకు గుడ్ బై చెప్పడంపై స్పందించగా, తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘ మనం మైదానంలో గడిపిన క్షణాలు అద్భుతమైనవి. అద్వితీయమైన కెరీర్‌ను సాగించినందుకు నీకు అభినందనలు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఒక మ్యాచ్ విన్నర్ దూరమయ్యాడు’ అంటూ యువీని కొనియాడాడు అక్తర్.
(ఇక్కడ చదవండి: మైదానంలో ‘మహరాజు’)
దీనిపై యువీ స్పందిస్తూ.. ‘ నీ లవ్లీ విషెస్‌కు ధన్యవాదాలు. నీవు వేసిన ప్రతీ బంతిని నేను ఆస్వాదించా. నిన్ను ఎదుర్కోవడానికి చాలా ధైర్యాన్ని కూడగట్టుకునే వాడ్ని. మన మధ్య జరిగిన క్రీడా యుద్ధం ఎప్పటికీ పదిలమే. అక్తర్.. ఆ క్షణాలు ఎప్పటికీ మధురమే’ అంటూ యువీ రిప్లై ఇచ్చాడు. యువరాజ్ సింగ్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. సోమవారం తన రిటైర్మెంట్‌పై ప్రకటన చేసిన యువరాజ్...అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇకపై ఐపీఎల్ కూడా ఆడనని యువీ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి:యువరాజ్ గుడ్‌బై)
Comments
Please login to add a commentAdd a comment